Thursday, 5 November 2026

లక్షా నూటపదహర్లు పలికిన గణనాధుని లడ్డు ప్రసాదం

మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్11(జనంసాక్షి)

మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని పాత పోచారంలో శ్రీ ప్రసన్నంజనీయ స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన గణనాథుడు నవరాత్రులు పూజలందుకున్న లడ్డు ప్రసాదాన్ని పార శ్రీశైలం, రేకం బాలకృష్ణ లు ఒక లక్ష నుటపదహరురూపాయలతో పాడి గెలుచుకున్నారు. లడ్డు ప్రసాదం కైవశం చేసుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కాశబోయిన సత్యం, బండి అనిల్, బొందిల నాగరాజు, దూదిపాల వెంకటేష్, పంజాల సందీప్, మట్టిపల్లి నాగరాజు, భయ్యా సురేష్, అల్లం సందీప్, బచ్చలకురి రమేష్, బట్టు రమేష్, బట్టు పవన్ తదితరులు పాల్గొన్నారు.