ఘనంగా ఐలమ్మ వర్ధంతి వేడుకలు

కొనరావుపేట సెప్టెంబర్ 10 (జనంసాక్షి) తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు సబ్బండ వర్గాల ఆత్మగౌరవ మహిళ చైతన్యానికి ప్రతీకగా నిలిచిన చాకలి ఐలమ్మ 37 వ వర్థంతి పురస్కరించుకుని కొనరావుపేట మండల కేంద్రంలో రజక సంఘం అధ్యక్షుడు పండిమడుగు సత్తయ్య, ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు,చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు, అనంతరం వారు మాట్లాడుతూ ఐలమ్మ ఆశయ సాధనకోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు,ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు పొన్నం పర్సరాములు,పొన్నం రాములు,లోకుర్తిరాజయ్య,లోకుర్తి కాశయ్య,చెక్కపెల్లి లచ్చయ్య,దేవయ్య తో పాటు తదితరులు ఉన్నారు.