Wednesday, 4 November 2026

లక్ష్యాన్ని అధిగమించిన శ్రీరాంపూర్‌ సింగరేణి

ఆదిలాబాద్‌,మార్చి25 : శ్రీరాంపూర్‌ ఏరియా బొగ్గు ఉత్పత్తిలో లక్ష్యాన్ని సాధించింది.  ఈ ఆర్థిక సంవత్సరం 52.6 లక్షల టన్నుల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకోగా, ఈనెల 24 నాటికి 52.7 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించింది. ఈ సందర్భంగా శ్రీరాంపూర్‌ ఏరియా చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ సీహెచ్‌ వెంకటేశ్వర్‌రావు కార్మికులను, అధికారులను అభినందించారు. శ్రీరాంపూర్‌ ఏరియాకు 2014-15 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశిరచిన వార్షిక లక్ష్యాన్ని కార్మికులు, అధికారులు సమష్టిగా పనిచేసి వారం రోజుల ముందే అధిగమించారు.  ఏరియా అధికారులు, కార్మికులు, సూపర్‌వైజర్లు, సాంకేతిక నిపుణులు, కార్మిక సంఘాల ప్రతినిధులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అన్ని వర్గాల ఉద్యోగుల సమష్టి కృషివల్లనే సాధ్యమైందని అన్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో మొదటి రోజు నుంచే ఏరోజుకు నిర్దేశిరచిన లక్ష్యాన్ని అదేరోజు సాధించేలా ప్రతి ఒక్కరూ పట్టుదలతో కృషి చేస్తే ఎలాంటి వ్యయప్రయాసలు లేకుండా, ప్రమాదాలకు గురికాకుండా ఉత్పత్తిని సాధించవచ్చని హితవు పలికారు. ఇదిలావుంటే సింగరేణి ఒప్పంద కార్మికులను క్రమబద్ధీకరించాలని పలుకార్మిక సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. సింగరేణి కార్మికులకు క్రమబద్ధీకరణ కోసం  సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హావిూని  నిలుపుకోవాలన్నారు. హైపవర్‌ కమిటీ సిఫారసుల ప్రకారం వేతనాలు ఇవ్వాలన్నారు. గతంలో ఒప్పందం కుదిరిన విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యాన్ని, వివక్షతను నిరసించారు. కార్మికులకు బోనస్‌ ప్రకటించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *