Wednesday, 4 November 2026

*లయన్స్ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో 5000 ఆర్థిక సహాయం*

మెట్పల్లి టౌన్, సెప్టెంబర్ 08
(జనం సాక్షి)
మెట్పల్లి పట్టణ కేంద్రంలో ఈరోజు నిరుపేద జువెల్లర్ కార్మికుడైన కోటగిరి ఆంజనేయులు ఇటీవల రెండు కళ్ళు కనిపించక బాధపడుతూ ఉండటంతో అతనికి మెట్పల్లి లయన్స్ క్లబ్ సభ్యులు అయినా బొమ్మల శంకర్ ప్రతాప్ రెడ్డి కొడిమ్యాల వెంకటస్వామి నాంపల్లి పెద్ద శ్రీనివాస్ మహేష్ పలువురు ఆర్థిక సహాయం కింద 5000 రూ ఖర్చుల కొరకు ఇచ్చి రేకుర్తి హాస్పిటల్ కు కంటి ఆపరేషన్ నిమిత్తం పంపినారు. అత్యవసరం కింద 5000 ఆర్థిక సహాయం చేసి, కంటి ఆపరేషన్ నిమిత్తం రేకుర్తి హాస్పిటల్ పంపిన లైన్స్ క్లబ్ సభ్యులకు, కంటి చికిత్స కోసం వెళ్తున్న కోటగిరి ఆంజనేయులు కృతజ్ఞతలు , అభినందనలు తెలిపారు