Wednesday, 4 November 2026

లయోలా అకాడమీ కళాశాలలో అంతర్జాతీయ సదస్సు

అల్వాల్ (జనంసాక్షి) సెప్టెంబర్ 2
విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని చైర్మన్ ధన క్రాప్ సైన్సెస్ లిమిటెడ్ పివి రవికుమార్ అన్నారు.అల్వాల్ పట్టణ కేంద్రంలోని లయోలా అకాడమీ కళాశాలలో సెప్టెంబర్ 1 నుండి 3వ తేదీ వరకు ఐసిసి టిఏఎస్ 2022 అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్నామని ఈ సదస్సులో అనువర్తిత శాస్త్రంలోని నూతన ఆవిష్కరణలు పురోగతి గురించి వివిధ రంగాలలో శాస్త్రవేత్తల ద్వారా విద్యార్థులకు బోధించుచున్నారు. ఈ సమావేశానికి లయోలా కళాశాలలో అగ్రికల్చర్ బయోటెక్నాలజీ కెమిస్ట్రీ కళాశాలలో అగ్రికల్చర్ బయోటెక్నాలజీ కెమిస్ట్రీ కెమికల్ టెక్నాలజీ మరియు ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ సమగ్రంగా నిర్వహించుచున్నట్లు కళాశాల  ప్రిన్సిపల్ జ్యోజీ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ సదస్సులకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన సంజీవ్ కుమార్ శాస్త్రవేత్త, శ్రీ రామారెడ్డి, డైరెక్టర్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.