హైదరాబాద్ : కరోనా మహమ్మారి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం స్వీయ నిర్బంధ చర్యలు చేపట్టింది. ఈ నెల 31వ తేదీ వరకు లాక్‌డౌన్ ప్రకటించడంతో.. ఏయే సేవలు అందుబాటులో ఉంటాయో ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జీవోను విడుదల చేసింది.
తెరిచి ఉండేవి..
- కిరణా దుకాణాలు
- మెడికల్ షాపులు
- సూపర్ మార్కెట్లు
- కూరగాయలు, పాల దుకాణాలు
- చికెన్, మటన్, చేపల మార్కెట్లు
- బ్యాంకులు, పోస్టు ఆఫీసులు
- పెట్రోల్ బంక్‌లు
- గ్యాస్ ఏజెన్సీలు
- ఫైర్ సర్వీస్
మూసి ఉండేవి..
- టీ, టిఫిన్ సెంటర్లు
- సెలూన్ షాపులు
- బట్టల దుకాణాలు
- బంగారం, ఫ్యాన్సీ, గాజులు, టైలరింగ్ షాపులు
- ఎలక్ట్రికల్ వస్తువుల దుకాణాలు
- టాయ్స్ షాపులు
- విద్యా సంస్థలు




