Tuesday, 3 November 2026

లాడ్జిలో జవాన్‌ అనుమానాస్పద మృతి

హైదరాబాద్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): శంషాబాద్‌లోని ఓ లాడ్జీలో ఆర్మి జవాన్‌ అనుమానాస్పదంగా మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ లాడ్జీలో ఆర్మి జవాన్‌ తోకల జగదీష్‌ (25) అనుమానాస్పద మృతి కలకలం రేపింది. సర్వ గ్రామానికి వచ్చే క్రమంలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుండి శంషాబాద్‌ లోని లాడ్జీలో రెస్ట్‌ తీసుకుందామని రూములో మృతుడై కనిపచడంతో తీవ్ర కలకలం రేగింది. కేసు నమోదు చేసిన ఎయిర్‌పోర్ట్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.