వనపర్తి,ఫిబ్రవరి22(జనంసాక్షి): ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలుకాగా అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలిలా ఉన్నాయి. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న వీఆర్‌ఎల్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు కొత్తకోట మండలం విలియం కొండ దగ్గర జాతీయ రహదారిపై లారీని ఢీకొంది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని పోలీసులు, స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కాగా… అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.




