Tuesday, 3 November 2026

లారీని ఢీకొన్న డిసిఎం: డ్రైవర్‌,క్లీనర్‌ మృతి

యాదాద్రి భువనగిరి,మే4(జ‌నంసాక్షి): జాతీయరహదారి 163పై యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్‌  వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఎస్‌.ఐ సుధాకర్‌గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం… తెల్లవారుజామున 4గంటల సమయంలో హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ వైపు వెళ్తున్న లారీని బీబీ నగర్‌ బ్యాంకుల సవిూపంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన డీసీఎం లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్‌, క్లీనర్‌ అక్కడికక్కడే మృతిచెందారు. డీసీఎం క్యాబిన్‌లో చిక్కుకున్న మృతదేహాలను  జాతీయ రహదారి సిబ్బంది, పోలీసులు అరగంట పాటు శ్రమించి బయటకు తీశారు.