లీఫ్ డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే.

మల్కాజిగిరి.జనంసాక్షి.ఆగస్టు 6
నాణ్యత ప్రమాణాలతో వ్యాపారాన్ని నిర్వహించినప్పుడే ఆ వ్యాపారం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేర్కొన్నారు.ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా ముగ్గురు స్నేహితులు కలిసి నే రెడ్ మెట్ డివిజన్ పరిధిలోని యాప్రాల్ తులసి గార్డెన్ ప్రాంతంలో  అత్యంత అధునాతన హంగులతో ఏర్పాటు చేసిన గోల్డెన్ లీఫ్ డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ ను ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.నేటి యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం వెంపర్లాడకుండా తమ స్వశక్తితో వ్యాపారం నిర్వహించి నలుగురికి ఉపాధి కల్పించే విధంగా ముందుకు సాగాలని సూచించారు. ప్రభుత్వం నిరుద్యోగ వ్యవస్థను నిర్మూలించేందుకు ఎన్నో ఉద్యోగాలు అర్హులైన యువతకు అందించిందని పేర్కొన్నారు.మంచి రుచికరమైన వంటకాలను తక్కువ ధరలో అందించినప్పుడు ఆ వ్యాపారం అభివృద్ధి చెందుతుందని రెస్టారెంట్ నిర్వాహకులకు సూచించారు.ఫార్మర్ కౌన్సిలర్  దన్ పాల్ రెడ్డి,కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి,ఉపేందర్ రెడ్డి, నిర్వాహకులు మహేష్ కుమార్,
మహేష్ రెడ్డి,నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు