బిల్ కలెక్టర్లకు బోడుప్పల్ మేయర్ బుచ్చిరెడ్డి ఆదేశం
మేడిపల్లి – జనం సాక్షి
మార్చి 31 కల్లా 100శాతం పన్ను వసూలుకు కృషి చేయాలని, ట్రేడ్ లైసెన్స్ చార్జీలు వసూలు చేయాలని బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి బిల్ కలెక్టర్లను ఆదేశించారు. బోడుప్పల్ నగర పాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ఆఫీస్ స్టాఫ్, పారిశుద్ధ్య సిబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వివిధ అంశాలపై మాట్లాడారు. శానిటేషన్ పనుల పర్యవేక్షణ ఉదయం 5 గంటలకు స్వయంగా పరిశీలిస్తానని చెప్పారు. వార్డు ఆఫీసర్లకు పారిశుధ్య నిర్వహణ కోసం పలు సూచనలు చేశారు. ప్లాస్టిక్ నివారణకు జరిమానా విధించడం, క్రమం తప్పకుండా విధులకు హాజరు కావాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ వెంకటేష్, వార్డు ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
Attachments area




