గరిడేపల్లి, ఫిబ్రవరి 7 (జనం సాక్షి):
మల్బరి సాగు చేపట్టి పట్టు పురుగుల పెంపకం చేపట్టడం ద్వారా రైతులు నెల నెల ఆదాయాన్ని పొందవచ్చునని సూర్యాపేట జిల్లా ఉద్యాన పట్టుపరిశ్రమ అధికారి బి శ్రీధర్ అన్నారు. కేవీకే గడ్డిపల్లిలో సోమవారం ఏర్పాటు చేసిన మూడు రోజుల పట్టు పరిశ్రమలో నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ముఖ్య అతిధిగా ప్రారంభించి పట్టు పరిశ్రమ ప్రాముఖ్యత గురించి వివరించారు . ఈ శిక్షణ కార్యక్రమంను కేంద్రియ పట్టు పరిశోదనా కేంద్రం రీజినల్ రీసెర్చ్ సెంటర్ ములుగు వారి ఆర్ధిక సహకారంతో నిర్వహిస్తున్నట్లు తెలంగాణ లోని 14 జిల్లాల నుండి యువ రైతులు ఈ శిక్షణ కి హాజరు అవుతున్నట్లు కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ హెడ్ బి. లవకుమార్ తెలియజేసారు. కేవీకే నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమం పట్టు పరిశ్రమ స్థాపన ద్వారా ఉపాధి అవకాశాల గురించి వివరించారు.అనంతరం కేవీకే సెక్రటరీ డా జి. సత్యనారాయణ రెడ్డి ప్రత్యామ్నాయ పంటల సాగు చేయడానికి మల్బరీ ఎంతో అనుకూలంగా ఉంటుందని అధిక ఆదాయం పొందవచ్చునని అన్నారు. మన దేశంలో పట్టు ఉత్పత్తి 36 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అయితే డిమాండ్ 60 వేల టన్నులు ఉన్నదని ప్రాంతీయ పట్టు పరిశోదన కేంద్రం ప్రిన్సిపల్ సైంటిస్ట్ హెడ్ డా. ప్రవీణ్ కుమార్ అన్నారు. పట్టు ఉత్పత్తి మార్కెటింగ్ అంశాలపై జిల్లాలోని ఎంపిక చేసిన రైతులకు కేవీకే ద్వారా నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.జిల్లాలోని పట్టు రైతులకు ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ ద్వారా తగు సహకారం అందిస్తున్నామని సబ్సిడీల గురుంచి పట్టు పరిశ్రమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వీర కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో కేవీకే పట్టు పరిశ్రమ విభాగం శాస్త్ర వేత్త డా టీ మాధురి పట్టు సాగు లో చేపట్టవలసిన మెలకువ ల గురుంచి తెలియజేసారు. ప్రాంతీయ పట్టు పరిశ్రమ సీనియర్ శాస్త్రవేత్త వినోద్ కుమార్, కేవీకే శాస్త్రవేత్తలు ఏ కిరణ్, డి ఆదర్శ్, ch నరేష్ ల తో పాటు తెలంగాణా లోని 14 జిల్లాలకు చెందిన 40 మంది యువ రైతులు పాల్గొన్నారు.
Attachments area




