వచ్చే ఎన్నికల్లో అవినీతి కేసీఆర్ కు బుద్ధి చెప్పాలి

స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 20 , ( జనం సాక్షి) : ఎన్నికల అప్పుడు సీఎం కేసీఆర్ ఇంటికోఉద్యోగం ఇస్తానని చెప్పి, తన కుటుంబంలో 5 గురికి ఉద్యో గాలు ఇచ్చాడు తప్ప, ఏ ఒక్క నిరుద్యోగికి ఉద్యో గాలు ఇవ్వకపోగా,ఉద్యోగాలు ఇవ్వమంటే ఊరికి 10 బెల్టుషాపులు పెట్టించి ప్రజల ప్రాణాలతో చెల గాటం ఆడుతున్నాడని అలాంటి అవినీతి కేసీఆర్ కు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు, ఎంపీ బండి సంజయ్ పిలుపునిచ్చారు.యాదగిరిగుట్ట నుండి ప్రారంభిం చిన మూడవ విడత బిజెపి పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర శనివారం రాత్రి 9 గంటలకు మండలంలో ని మీదికొండ గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భం గా బండి సంజయ్ బిజెపి పార్టీ జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ప్రభు త్వంలో అవినీతి రాజ్యమేలుతోందని, ఇకనుండి కేసీఆర్ చెప్పే మాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేర ని అన్నారు.రాష్ట్రంలో పేద ప్రజలకు వచ్చేసంక్షేమ పథకాలలో సగం డబ్బులు కేంద్ర ప్రభుత్వం, నరేం ద్ర మోడీ పంపుతున్నాడుఅని అన్నారు.మునుగో డులో కెసిఆర్ సభకు డబ్బులు ఇచ్చి ప్రజలను తెచ్చుకున్నప్పటికీ ప్రజలు ఎవరు కేసీఆర్ మాట వినలేదని సభపూర్తిగా ఫెయిల్ అయిందని అన్నా రు. ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా మునుగోడు లో బిజెపి పార్టీ విజయం సాధిస్తుంది అన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో  మీదికొండ గ్రామానికి కనీసం బస్సు సౌకర్యంకూడా కల్పించలేక పోయా రన్నారు.డబుల్ బెడ్ రూములుఇవ్వలేదని,ఉద్యో గాలు రాలేదని, కొత్త రేషన్ కార్డులు రాలేదని, దళి తులకు మూడెకరాల భూమి ఇవ్వలేదని, దళిత బంధు అందరికీ ఇవ్వలేదని, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక హామీలు ఇచ్చి మాట తప్పిన కెసిఆర్ కు తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంద న్నారు. పేద ప్రజల కోసం రేషన్ షాపుల ద్వారా ఉచిత బియ్యం అందిస్తున్న ఘనత,ఉచిత గ్యాస్ లు ఇచ్చినఘనత నరేంద్ర మోడీ,బిజెపి ప్రభుత్వా నిదే అన్నారు. ఈ యాత్రను అడ్డుకోవాలని ప్రయ త్నాలు చేస్తే సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి రాకుండా అడ్డుకోగలుగుతామని అన్నారు. రైతు బంధు ద్వారా పేద ప్రజలకు ఒరిగిందేమీ లేదని ధనికులు లాబపడుతున్నారని అన్నారు.ఈసంగ్రా మ యాత్ర ద్వారా ప్రజల నుంచి సమస్యలు తెలు సుకుని ప్రధాని మోడీ కి తెలియపరచి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా అన్నారు. నియోజకవర్గ మొత్తంలో సంగ్రామ యాత్రకు కావలసిన అన్ని ఏర్పాట్లను చేసిన మాదాసు వెంకటేష్ ను బండి సంజయ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ గుండె విజయరామారావు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, పాపారావు,కెవిఎల్ఎన్ రెడ్డి, మాదాసు వెంకటేష్, పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, బొజ్జపెళ్లి సుభాష్,గట్టు కృష్ణ తదితర నాయకులు పాల్గొన్నారు.