73 లక్షల విలువైన బంగారు, వెండి స్వాధీనం
హైదరాబాద్,జనవరి28(జనంసాక్షి): రాచకొండ పీఎస్ పరిధిలో వరుస చోరీలకు పాల్పడుతున్న వేముల నటరాజును అరెస్ట్ చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని కుషాయిగూడ, జవహర్ నగర్, కీసరలో 47 ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు చెప్పారు. పశ్చిమగోదావరికి చెందిన నటరాజు, అక్కడ కూడా 16 చోరీలు చేసినట్లు గుర్తించాం. రూ.73 లక్షల విలువైన 2 కిలోల బంగారు ఆభరణాలు, ఏడున్నర కిలోల వెండి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నటరాజు దగ్గర నుంచి బంగారం కొనుగోలు చేస్తున్న తూప్రాన్ కు చెందిన క్రిష్ణచారి, నరేశ్ చారి, పశ్చిమగోదావరికి చెందిన రాజశేఖర్ లపై కేసు నమోదు చేశామన్నారు.




