హర్షం వ్యక్తం చేసిన సిఎం కెసిఆర్
హైదరాబాద్,జనవరి28(జనంసాక్షి): న్యూఢిల్లీలో సనిచేస్తున్న సీనియర్ పాత్రికేయుడు, పాలమూరు జిల్లాకు చెందిన అప్పరసు కృష్ణారావుకు కేంద్ర సాహిత్య అకాడవిూ అవార్డు ప్రకటించడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అప్పరసు కృష్ణారావు పాత్రికేయ వృత్తిలో, సాహిత్య రంగంలో మరింత ఎదిగి రాష్ట్రానికి పేరు తేవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. అప్పరసు కృష్ణారావు పాత్రికేయుడు, కవి, రచయితగా సేవలందించారు. ఉదయం దినపత్రిక,ఆంధ్రజ్యోతి తదితర పత్రికల్లో ఆయన పనిచేశారు.




