Wednesday, 4 November 2026

వర్కర్ టు ఓనర్ పథకం పూర్తి చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో పాదయాత్ర.

 

రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఆగస్టు 8. గతంలో మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నేత కార్మికులకుఇచ్చిన హామీ పథకం వర్కర్ టు ఓనర్ పథకం తక్షణ పూర్తి చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో సిరిసిల్ల విగ్రహం నుండి కలెక్టరేట్ వరకు మంగళవారం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మూశం రమేష్, కోడల రమణ మాట్లాడుతూ తక్షణమే పథకం పూర్తిచేసి కార్మికులను యజమాను చేసేలా మరమగ్గాలు అందజేయాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో శ్రీరామ్ సదానందం, ఉడుత రవి, నక్క దేవదాస్, పలురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.