వర్షంలో తడుస్తూ అమ్మవారికి మొక్కులు చేల్లించుకున్న మహిళలు
కోదాడ టౌన్ ఆగస్టు 07 ( జనంసాక్షి )
కోదాడ పట్టణంలో బోనాల పండుగను ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున బోనాలను ఎత్తుకొని ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో ఉన్న ముత్యాలమ్మ గుడి వద్ద బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.బోనాలతో వస్తుండగా భారీ వర్షం వచ్చినప్పటికీ తడుస్తూనే ఆలయం వద్దకు చేరుకొని తమ భక్తి పారవశాన్ని చాటుకున్నారు.పట్టణ ప్రజలంతా ఐకమత్యంగా ప్రతి ఏడాది ఈ పండుగను నిర్వహించుకుంటామని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ కోదాడ పట్టణ మహిళా నాయకురాలు సూర్యదేవర మాధవి,
కంబాల తిరుపమ్మ, ప్రశాంతి,శోభ రాణి,శైలజ,చంద్రకళ, కంబాల రవి,శ్రీనివాస్,శ్రీదేవి,వెంకన్ న,నరేందర్ రావు,
జనార్ధన తదితరులు పాల్గొన్నారు.