Sunday, 8 November 2026

వర్షపు నీటి కాలువలోకి డ్రైనేజ్ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి : కార్పొరేటర్ బానోత్ సుజాత నాయక్

ఎల్బీ నగర్ (జనం సాక్షి  )  హస్తినాపురం కార్పొరేటర్ బోనత్ సుజాత నాయక్  హస్తినాపురం నార్త్ ఎక్స్టెన్షన్ కాలనీలో హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అధికారులతో కలిసి పర్యటించారు  కాలనీవాసులు తన దృష్టికి తీసుకువచ్చిన వర్షపు నీటి కాలువలోకి డ్రైనేజీ వెళ్లడం పై అధికారులకు సూచనలు చేసి వెనువెంటనే వర్షపు నీటి కాలువలోకి డ్రైనేజ్  వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడమైనది అదేవిధంగా ప్రజలకు నీటి బిల్లుల చెల్లింపు పై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం అధ్యక్షులు పిండి లింగారెడ్డి గారు చంద్రశేఖర్ యాదవ్ గారు మరియు వారి కమిటీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారు నాగిరెడ్డి గారు క్రాంతి కిరణ్ రెడ్డి టిఆర్ఎస్ నాయకులు జానకిరామ్ నాయక్ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు