Tuesday, 3 November 2026

వర్షాకాలం తరవాతనే రోడ్ల పునర్నిర్మాణం

అధికారులతో ఉన్నతస్థాయి సవిూక్ష

మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌

హైదరాబాద్‌,జూన్‌29(జనం సాక్షి): జిహెచ్‌ఎంసి, మెట్రో వాటర్‌ వర్క్స్‌, హైదరాబాద్‌ రోడ్‌ డెవలప్‌ మెంట్‌ కార్పోరేషన్‌ ద్వారా చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులు అక్టోబర్‌ చివరి నాటికి పూర్తిచేయాలని మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.శుక్రవారం కవిూషనర్‌ కార్యాలయంలో మున్సిపల్‌ శాఖ ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో ఆయన సవిూక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్ల వెడల్పు, పుట్‌పాత్‌ల నిర్మాణం, పునరుద్ధరణ పనులు వెంటనే చేపట్టాలన్నారు. వర్షాకాలం ముగిసిన తరువాతనే రోడ్ల నిర్మాణం చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామన్నారు. పనులు చేపట్టడంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. పనులలో నాణ్యత కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నిర్దేశిరచిన కాలపరిమితిలో పనులు పూర్తి చేయాలని ఆయన తెలిపారు. హైదరాబాద్‌ రోడ్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా చేపడుతున్న పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, నిర్ణీత కాలపరిమితిలోగా పనులు పూర్తవుతాయని చీఫ్‌ ఇంజనీర్‌ మోహన్‌ నాయక్‌ వివరించారు. జిహెచ్‌ఎంసి ఇంజనీర్లతో సవిూక్షిస్తూ పనులు చేపట్టేటప్పుడు మెట్రోవాట్ర్‌ వర్క్స్‌ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు. మంచినీటికి సంబంధించిన పనులు పూరైన తరువాతనే మిగతా పనులు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. వివిధ పనులకు సంబంధించి పనులకు ముందు, పనులు జరుగుతున్నప్పుడు, పనులు పూర్తయినతరువాత ఎప్పటికప్పుడు ఫోటోలను సోషల్‌ విూడియా ద్వారా పంపాలని ఆయన సూచించారు. ప్రజల నుండి సోషల్‌ విూడియా ద్వారా ఏమైనా ఫిర్యాదులు అందితే వెంటనే స్పందించి పూర్తి చేయాలన్నారు.మెట్రోవాటర్‌ వర్క్స్‌ యండి దానకిషోర్‌ మాట్లాడుతూ 300 పప పైపులైన్‌ ట్రెంచెస్‌ కు సంబంధించి బి.టి, సి.సి రోడ్లపై 683.19 కిలో విూటర్లకు గాను 677.69 కి.విూ ల పునరుద్ధరణ పనులు పూర్తిచేసామని మిగతావి త్వరలో పూర్తి అవుతాయని తెలిపారు. 300పప పైపులైన్‌ ట్రెంచెస్‌ కంటే పెద్దవైన పైపులైన్లకు సంబంధించి 160.23 కిలోవిూటర్లకు గాను 131.44 కి.విూ పూర్తిచేశామని మిగతాయి త్వరలో పూర్తిఅవుతాయని ఆయన వివరించారు.