నాంపల్లి అక్టోబర్ 1 (జనం సాక్షి )వరుసగా కురుస్తున్న వర్షాలకు నాంపల్లి మండలం నేవ్వేలగూడెం గ్రామంలో షేక్ చాంద్ పాషా స్లాప్ ఇల్లు కూలింది. నాలుగైదు రోజులు వరుసగా కురుస్తున్న వర్షాలకు శుక్రవారం రాత్రి ఇల్లు కూలింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరులేనందున పెను ప్రమాదం తప్పింది.దీంతో ఇంట్లోని నిత్యావసర సరుకులు, దుస్తులు ఇంట్లోనె ఉన్నందున వారికి కూడు, గుడ్డ లేదని విలపిస్తున్నారు.
వర్షానికి కూలిన ఇల్లు




