శ్రీ లక్ష్మి నరసింహ భజరంగ్ ధల్ యూత్ ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల కబడ్డీ పోటీలు
గరిడేపల్లి, అక్టోబర్ 1 (జనం సాక్షి): మండలంలోని సర్వారం గ్రామంలో శ్రీ లక్ష్మి నరసింహ భజరంగ్ ధల్ యూత్ ఆధ్వర్యంలో రెండు రాష్టాల కబడ్డీ పోటీలు సర్పంచ్ కర్నాటి నాగిరెడ్డి సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ నామ నర్సింహారావు చేతుల మీదుగా ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ నాగిరెడ్డి మాట్లాడుతూ సర్వారం యువతి యువకులు చదువుతో పాటు క్రీడలలో కూడా రాణించాలని మన ఊరికి రాష్ట్రానికి మంచి పేరు తీసుకరావలని నా వంతు సహకారం ఉంటుందని యువత ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కర్నాటి శ్రీనివాస రెడ్డి , కర్నాటి వెంకటరెడ్డి, బోగాల వీరారెడ్డి, వెంకటరెడ్డి , గుమ్మడేల్లి రాముడు, కార్తీక్, చింతకాయల వీరబాబు, రుద్రాపంగు మనిబాబు, కృష్ణ, తిరప్పయ్య , లక్ష్మయ్య , దుర్గయ్య, నాగేశ్వరరావు, వీరయ్య ,కమలరెడ్డి , క్రీడా అభిమానులు తదితరులు పాల్గొన్నారు.