వసతి గృహంలో అభివృద్ధి పనులకు భూమిపూజ

 

రుద్రంగి ఆగస్టు 29 (జనం సాక్షి)
రుద్రంగి మండలకేంద్రంలోని ఎస్సి ఎస్టీ బాలుర వసతి గృహంలో ఉన్న విద్యార్థులకు అన్ని సదుపాయాలు కలిపించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే చెన్నామనేని రమేష్ బాబు సహకారంతో మంజూరైన 30 లక్షల ఎస్.డి.ఎఫ్ నిధులతో వంట గది డైనింగి హాల్ వాలీబాల్ కోర్ట్ మరియు ఇతర వసతుల కోసం ఈ రోజు ఎంపిపి గంగం స్వరూప మహేష్,జడ్పిటిసి గట్ల మినయ్య,పంచాయితీ రాజ్ డీఈ భూమేష్,సర్పంచ్ తర్రె ప్రభాలత మనోహర్ పాల్గొని కొబ్బరికాయ కొట్టి భూమిపూజ చేశారు.ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అన్ని వసతులు కలిపించడమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.ఇట్టి పనులను నాణ్యమైన పద్దతిలో నిర్మించాలని కోరారు.వసతి గృహం అభివృద్ధి కోసం నిధుల మంజూరికి కృషి చేసిన ఎమ్మెల్యే రమేష్ బాబు కి దాన్యవధాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో
ఆలయ చైర్మన్ కొమిరె శంకర్,నాయకులు మాడిశెట్టి అభిలాష్,దయ్యాల కమలాకర్,చెప్యాల గణేష్,గుగ్గిళ్ల వెంకటేష్,మోహన్,ఏఈ మనోహర్,
తదితరులు పాల్గొన్నారు.