వారం రోజుల్లో 100 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవం -అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం

వారం రోజుల్లో 100 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవం -అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం

 

అలంపూర్ సెప్టెంబర్ 23(జనంసాక్షి )
అలంపూర్ చౌరస్తా లో నిర్మిస్తున 100 పడకల ఆసుపత్రి వారం రోజులలో ప్రారంభోత్సవం చేయండి జరుగుతుంది అని ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. శనివారం ఆసుపత్రి భవన నిర్మాణ పనులను అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం పరిశీలించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే చరవనిలో కాంట్రాక్టర్ కి భవన నిర్మాణం పనులు పూర్తి స్థాయిలో ఈ నెల ఆకరికి నాటికి పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు.వారం రోజుల్లో 100 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవం చేసుకునేలా పనులను వేగవంతం చేయాలని సంబంధిత శాఖ మంత్రిని ,అధికారులను కోరడం జరిగింది,మంత్రి స్పందిస్తూ తప్పకుండా వారం రోజుల్లో ప్రారంభోత్సవం చేసుకుందాం అని తెలిపారు అని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ధనంజయ ,బీసీ సెల్ అధ్యక్షుడు కృష్ణ గౌడ్ ,ఉప అధ్యక్షుడు రమేష్ ,జగదీష్ , మరియు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు