ఫోటో ఎక్స్ పో వాల్ పోస్టర్ ఆవిష్కరణ

ఫోటో ఎక్స్ పో వాల్ పోస్టర్ ఆవిష్కరణ

వేములవాడ సెప్టెంబర్ 23 (జనం సాక్షి)
అక్టోబర్ 6,7,8 తేదీలలో నిర్వహించబోయే ఫోటో ట్రేడ్ ఎక్స్ పో ప్రచార వాల్ పోస్టర్లను వేములవాడ రూరల్ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు అక్కెనపల్లి శ్రీకాంత్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్ర ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ ల కోసం రాష్ట్ర అసోసియేషన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన ఈ ఫోటో ట్రేడ్ ఎక్స్ పోలో మన ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో వేములవాడ రూరల్ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు సందెల నరేష్. చిర్ర వేణు ,మహంకాళి బాబు, బొమ్మీన శ్రీనివాస్, సందీప్ , తడిగొప్పుల గోవర్ధన్, నేదురి రాజు, నేదురి శ్రీకాంత్, దానే వేణు, ఎండి అజ్జు, ఎడపెల్లి నాగరాజు తో పాటు తదితరులు పాల్గొన్నారు