అల్వాల్ (జనంసాక్షి) అక్టోబర్ 17
తన తండ్రి గారైన రాజ రతన్ గోపాల్ సైంచరకు సంబంధించిన వారసత్వపు బంగ్లాను తొలగింపుపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని అల్వాల్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఫౌండర్ చైర్మన్ రాజా సంజయ్ గోపాల్ సైంచర్ ఆరోపించారు. సోమవారం అల్వాల్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాదులోని కిషన్ ప్రసాద్ దేవుడి శాలిబండ ప్రాంతంలో 300 నుండి 3000 గజాల వరకు గల తమ తండ్రి రాజా రతన్ గోపాల్ సైంచర్ ఆస్తులైన పురాతన మహల్ ను స్థానికంగా నివసించే సచిన్ కపూర్ అనే అతను రాజకీయ పలుకుబడి అధికార పార్టీ నాయకులతో కలిసి జెసిబి యంత్రం సాయంతో పురావస్తు శాఖకు సంబంధించిన మహల్ ను చట్ట వ్యతిరేకంగా ధ్వంసం చేశారన్నారు. భూముల ధరలు విపరీతంగా పెరగడంతో వారు అక్రమ కబ్జాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ విషయమై ఉన్నత పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసామని ఆయన తెలిపారు. కానీ సంబంధిత అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.




