తొర్రూర్ మండల్ వైస్ ప్రెసిడెంట్ గా నాలం శ్రీనివాస్ నియామకం

మండలంలో మానవ హక్కుల పట్ల చట్టాల పైన అవగాహన కల్పించాలి అధ్యక్షుడు మంగళ పెళ్లి హుస్సేన్

తొర్రూర్ 17 అక్టోబర్( జనంసాక్షి )  డివిజన్ మున్సిపాలిటీ కేంద్రంలో జాతీయ మానవ హక్కుల న్యాయ సేవా సంఘం అధ్యక్షుడు మంగళ పెళ్లి హుస్సేన్ కానాపురం కు చెందిన నాలం శ్రీనివాసును ఈరోజు మండల వైస్ ప్రెసిడెంట్ గా నియమిస్తూ పత్రికా ప్రకటన తెలపడం జరిగింది, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో విద్యార్థులకు ప్రజలకు మానవ హక్కులు చట్టాలు పై విద్యార్థులకు ప్రజలకు అవగాహన కల్పిస్తూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని కోరారు, ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ రమేష్, మండల ప్రెసిడెంట్ కే ఉమేష్, స్టేట్ ట్రెజరీ శ్రీరామ్ నవీన్, జనరల్ సెక్రెటరీ మాచర్ల శ్రీనివాస్, కమిటీ మెంబర్ వీరస్వామి, తదితరులు పాల్గొన్నారు,