Tuesday, 3 November 2026

వారికి మామూలే

మహబూబ్‌నగర్: జిల్లాలో ఒక ప్రధాన ఆసుపత్రి, నాలుగు ఏరియా ఆసుపత్రులు, ఐదు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 85 పీహెచ్‌సీలున్నాయి. వీటికి ప్రధానంగా అనునిత్యం వెయ్యికి పైగానే ఓపీ ఉంటుంది. ఆస్పత్రులకు వచ్చే వారిని ముక్కుపిండి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. మరీ ప్రధానంగా జిల్లా ప్రధాన ఆసుపత్రి దోపిడీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. జిల్లా ప్రధాన ఆస్పత్రిలో డబ్బుల కక్కుర్తి ఆగడంలేదు. ప్రధానం గా నాలుగు విభాగాల్లో విచ్చలవిడిగా పేషెంట్ల సంబంధీకుల నుంచి డబ్బుల కోసం పీల్చి పిప్పిచేస్తున్నారు.

ప్రసూతిగది, ఆపరేషన్ థియే టర్, క్యాజువాలిటీ, మార్చురీ విభాగాల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నట్లు తరచూ ఆరోపణలు వస్తున్నాయి. ఆస్పత్రిలో ప్రసవం జరిగి తే.. మగపిల్లవాడు పుడితే రూ.వెయ్యి, ఆడపిల్ల పుడితే రూ.500 డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఇటువంటి ఆరోపణలు రావడంతో మూడుసార్లు పలువురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. అయినా వారిలో మార్పు రా వడంలేదు. కొన్ని నెలల క్రితమే పోస్టుమార్టం వద్ద విధులు నిర్వహిస్తున్న ఎన్‌ఎంఓలు యా దయ్య, కిష్ణయ్యలు డబ్బులు వసూలు చేశారనే ఆరోపణపై సస్పెండ్ చేశారు. అయినా ఆస్పత్రి సిబ్బంది తాజాగా చెన్నకేశవులు, ఆయన కూతురు ఆత్మహత్యకు కారకులయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *