వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలి
వనపర్తి:సెప్టెంబర్12(జనం సాక్షి) వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని తెలంగాణ వాల్మీకి సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్ మండ్ల దేవన్న ఒక ప్రకటనలో తెలిపారు.సీఎం కేసీఆర్ గతంలో వాల్మీకి బోయలను ఎస్టీ రిజర్వేషన్లు చేరుస్తామని మాట ఇచ్చి మరిచారన్నారు. ఇప్పటికైనా ఆ మాటను గుర్తు చేసుకొని నిలబెట్టుకోవాలని అసెంబ్లీలో మరోసారి చర్చించి వాల్మీకి బోయల ఎస్టీ రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపాలని వారన్నారు దేశంలో హర్యానా,ఢిల్లీ,పంజాబ్,హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక మరో ఐదు రాష్ట్రాలలో వాల్మీకి జయంతిని సెలవుదినంగా ప్రకటించారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విధమైనటువంటి చర్యలు తీసుకోనీ ఆరు లక్షల వాల్మీకి బోయల కోరికలను నెరవేర్చాలని కోరారు.