Thursday, 5 November 2026

వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మహాకవి ని స్మరించుకున్నారు.

 

 

‘అక్టోబర్ 9, (జనంసాక్షి)

‘సాధనాత్ సాధ్యతే సర్వం’’ (సాధన చేస్తే సాధ్యం కానిది ఏదీ లేదు) అనే సూక్తి కి, ఒక సామాన్యుడు వాల్మీకి మహర్షిగా ఎదిగిన తీరే నిదర్శనమని సీఎం అన్నారు.
భారతీయ సామాజిక తాత్వికతకు, కుటుంబ బాధ్యతలకు , ప్రజా పాలకుని త్యాగనిరతి కి, వాల్మీకి మహర్షి రచించిన రామాయణ మహా కావ్యం ప్రామాణికమని సీఎం కేసిఆర్ అన్నారు.
ఉన్నతమైన ఆదర్శాలు, మానవతా విలువల బోధనలను రామాయణం ద్వారా లోకానికి రమణీయంగా అందించి, ఆదికవిగా నిలిచారని సీఎం తెలిపారు.
సీతారాముల జీవితాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దిన రామాయణం మధుర కావ్యంగా, మహాకావ్యంగా లోకం చేత అదరించబడుతోందని, సిఎం కెసిఆర్ అన్నారు.