వాహనాల తనిఖీ చేసిన ఏర్గట్ల ఎస్సై కోరిడే రాజు

 ఏర్గట్ల సెప్టెంబర్ 22( జనంసాక్షి ): నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండల కేంద్రంలో గురువారం రోజున 25 వాహనాలు తనిఖీ చేయగా వాటిలో పది వాహనాలకు సరైన ఆర్సీ, లైసెన్స్ తదితర పత్రాలు లేకపోవడంతో మొత్తం పది వాహనాలకు ఐదు వేల రూపాయలు జరిమానా విధించినట్లు ఎస్సై రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ వాహనాలు నడిపే సమయంలో తలకు హెల్మెట్ ధరించాలని సరైన పత్రాలు కలిగి ఉండాలని లేనియెడల కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనికిలో హెడ్ కానిస్టేబుల్ శివయ్య, కానిస్టేబుల్ గంగాధర్,శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.