– సిఐటియు జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు
మాకవరపాలెం: ఫిబ్రవరి 17: జనం సాక్షి: వీఆర్ఏలు జీతాలు పెంచి వారి డిమాండ్ లను ముఖ్యమంత్రి పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి జి కోటేశ్వరావు పిలుపునిచ్చారు.గురువారం నాడు మాకవరపాలెం మండలం లో వీఆర్ఏలు చేస్తున్న దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించారు పది రోజులుగా వీఆర్ఏలు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నప్పటికీ వారి డిమాండ్ లను ప్రభుత్వం పరిష్కరించలేదని అన్నారు మిగతా ఉద్యోగులకు జీతాలు పెంచి రెవెన్యూ వ్యవస్థకు గ్రామస్థాయిలో పట్టుకొమ్మలు గా పనిచేస్తున్న విఆర్ఎ జీతాలు పెంచకపోవడం దారుణమని అన్నారు. వీఆర్ఏలు సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని అన్నారు. గ్రామ స్థాయిలో అన్ని పనులకు వీఆర్ఏలు ఉండాలని జీతాలు పెంచమంటే వీరు ఆనడం లేదని అన్నారు మార్చి 3 ,4 తేదీలలో కలెక్టర్ ఆఫీస్ ఎదుట ధర్నాలు చేస్తామని అన్నారు. చలో అమరావతి కూడా నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు డి సత్తిబాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని జీతం 15000 ఇవ్వాలని నిలుపుదల చేసిన జీఓ అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం అయ్యేవరకు ఉద్యమాన్ని కొనసాగించాలని ఉద్యమాలు చేయకుండా ప్రభుత్వం దిగి రాదని అన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం నాయకులు సత్యనారాయణ ,అప్పలకొండ ,సత్యనారాయణ లక్ష్మీ, ధనలక్ష్మి, వివిధ గ్రామాల నుండి వీఆర్ఏలు పాల్గొన్నారు.




