Wednesday, 4 November 2026

విఆర్ఏలకు సంఘీభావం తెలిపిన జర్నలిస్ట్.

నేరడిగొండసెప్టెంబర్16(జనంసాక్షి):మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట54 రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మెకు శుక్రవారం రోజున నెరడిగొండ మండల ప్రెస్ గ్రూప్ తరపున విఆర్ఏలకు సంఘీభావం తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా విఆర్ఏలు తమ న్యాయమైన డిమాండ్లతో సమ్మె చేస్తున్నారని అన్నారు.బేసిక్ పే ప్రమోషన్లు చిన్న చిన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అసెంబ్లీ సాక్షిగా విఆర్ఎలను రెగ్యులరైజ్ చేస్తానని ముఖ్యమంత్రి  ప్రకటించిన విషయంలో పట్టించుకోకపోవడం సమంజసం కాదని విఆర్ఏలకు న్యాయం చేయకపోతే వారి కుటుంబాలు రోడ్డున పడతాయని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలని మండల ప్రెస్ గ్రూప్ తరపున ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నెరడిగొండ ప్రెస్ గ్రూప్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.