సెప్టెంబర్ 2 నుండి ఎమ్మెల్యేల చేతుల మీదుగా పంపిణీ
విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి
వికారాబాద్ జిల్లా బ్యూరో జనం సాక్షి , ఆగస్టు 29 :
వృద్ధుల పెన్షన్ల వయసును 57 ఏళ్లకు తగ్గిస్తూ జారీ చేస్తున్న పెన్షన్లను సెప్టెంబర్ 2 వ తేదీ నుండి పంపిణీ చేయనున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సందర్భంగా ఆమె సోమవారం మాట్లాడుతూ, జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో శాసన సభ్యుల ఆధ్వర్యంలో నూతన పెన్షన్ కార్డుల పంపిణీ చేపట్టాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. గతంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నూతన పెన్షన్లు మంజూరు చేసారన్నారు. జిల్లాకు 25 వేల 121 నూతన పెన్షన్లు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వికారాబాద్ జిల్లా ప్రజల తరపున మంత్రి ధన్యవాదాలు తెలిపారు.




