వికారాబాద్ బిఆర్ఎస్ యువ నాయకులు వడ్ల నందు గారి సహకారంతో రూ.60 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేత..

 

 

 

 

 

 

సంక్షేమ పథకాలు మాత్రమే కాకుండా పేదోడికి ఆరోగ్య సమస్య వస్తే కూడా నేనున్నాను అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందిస్తూ పేదోడి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. అందులో భాగంగా వికారాబాద్ బిఆర్ఎస్ యువ నాయకులు వడ్ల నందు గారి సహకారంతో వికారాబాద్ మండలం, ద్యాచారం గ్రామానికి చెందిన బి.అనిత భర్త యాదయ్య గారికి రూ.60 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ధారూర్ వైస్ ఎంపీపీ విజయ్, కెరల్లి ఎంపిటిసి శ్రీనివాస్, కొండాపూర్ కలాన్ సర్పంచ్ పరమేష్, బిఆర్ఎస్ యువ నాయకులు లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.