Wednesday, 4 November 2026

విజిలెన్స్‌ విభాగంలో విధి నిర్వహణ కీలకం విజిలెన్స్‌ కమిషనర్ శ్రీకుమార్‌

హైదరాబాద్‌: విజిలెన్స్‌ విభాగంలో విధి నిర్వహణ కీలకమైందని, అదే సమయంలో సవాళ్లతో కూడుకున్నదని విజిలెన్స్‌ కమిషనర్‌ శ్రీకుమార్‌ అన్నారు. హైదరాబాద్‌లోని విజిలెన్స్‌ స్టడీ సర్కిల్‌ పదో వార్షికోత్సవ వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీకుమార్‌ మాట్లాడుతూ అవినీతిని నిర్మూలించడానికి అన్ని ప్రభుత్వ విభాగాలు కలసి సంయుక్తంగా పనిచేయాలని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ సొమ్మును కాపాడే బాధ్యత అందరిపై ఉందన్నారు. విజిలెన్స్‌ నిర్ణయాలు తీసుకోదని… మంచి నిర్ణయాలను అమలు చేస్తుందని శ్రీకుమార్‌ చెప్పారు. విశ్రాంత డీజీపీ హెచ్‌.జె.దొర మాట్లాడుతూ మోసాలు, అవినీతిని బయటపెట్టడంలో చీఫ్‌ విజిలెన్స్‌ అధికారుల పాత్ర కీలకమైందని పేర్కొన్నారు. మోసాలను బయటపెట్టడంలో ప్రతిభ కనబరించిన వివిధ బ్యాంకుల అధికారులకు ఈ సందర్భంగా విజిలెన్స్‌ కమిషనర్‌ శ్రీకుమార్‌, విశ్రాంత డీజీపీ హెచ్‌.జె. దొర పురస్కారాలు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *