ఇక్కడి నేలలు అనువైనవని పోచారం వెల్లడి
హైదరాబాద్,జూలై26(జనంసాక్షి): తెలంగాన విత్తన భాండాగారమని, ఇక్కడి నేలలు విత్తనాలకు అనుకూలమని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. గత నాలుగేళ్లుగా ప్రభుత్వం ఇక్కడ రైతులను ప్రోత్సహించి పంటలను పండిస్తోందన్నారు. బంజారాహిల్స్ మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఇండో-జర్మన్ సీడ్ సెక్టార్ డెవలప్మెంట్ రెండవ ప్రాజెక్టు స్టీరింగ్ కమిటీ సమావేశమైంది. గత రెండు సంవత్సరాలలో రాష్ట్ర విత్తన రంగంలో చేపట్టిన పలు అభివృద్ధి, అవగాహన, శిక్షణా కార్యక్రమాలు, ఇండో-జర్మన్ సీడ్ సెక్టార్ డెవలప్మెంట్ ప్రాజెక్టు భవిష్యత్ ప్రణాళికలపై ఈ సందర్భంగా చర్చిస్తున్నారు. జర్మనీ వ్యవసాయశాఖ ప్రతినిధులు, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్, తెలంగాణ రాష్ట్ర సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మెన్ కోటేశ్వరరావు, వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి, వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్ మోహన్, ప్రొ. జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ ప్రవీణ్ రావు ఈ సమావేశంలో పాల్గొన్నారు.




