విద్యాధికారిని మృతి పట్ల సంతాపం
జనంసాక్షి, మంథని : కరీంనగర్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిని రాజ్యలక్ష్మి ఆకస్మిక మరణం పట్ల తెలంగాణ ఎకానమిక్స్ ఫోరమ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావుల తిరుమల్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అర్థ శాస్త్ర అధ్యాపకురాలిగా, జిల్లా అధికారిగా ఎన్నో సేవలు అందించిన రాజ్యలక్ష్మి శుక్రవారం గుండెపోటు తో మృతి చెందడం బాధాకరం అన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని, ఆమె సేవలు మరువలేనివన్నారు.