జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి
స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా 9వ తేదీ నుండి 11 వ తేదీ వరకు 3 రోజులు 16వ తేదీ నుండి 21 వ తేదీ వరకు 6 రోజులు మొత్తం 9 రోజులు విధ్యార్ధులకు జిల్లాలోని 9 సినిమా హాలులలో గాంధీ పై రూపొందించిన చిత్రాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు చేసిన్నట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి రోజు 3,610 మండి పిల్లలు సినిమా చూసేందుకు , వారిని పాఠశాల నుండి సినిమా ధియేటర్ కు తీసుకొచ్చి తిరిగి పాఠశాలలో దింపేందుకు బస్సు సౌకర్యాని కల్పించిన్నట్లు ఆమె తెలిపారు.
భువనగిరి పట్టణంలో వసుంధర ధియేటర్ , భద్రాద్రి ధియేటార్ లలో, వల్లిగొండ లో వేంకటేశ్వర ధియేటర్, బీబీనగర్ లో రాఘవేంద్ర ధియేటర్, చౌటుప్పల్ లో అంజిరెడ్డి ధియేటర్, శ్రీనివాస ధియేటర్, యాదగిరిగుట్ట లో లక్ష్మి ధియేటర్, మోత్కూర్ లో శ్రీ వేంకటేశ్వర ధియేటర్, రాజాపేట లో వంశీకృష్ణ ధియేటర్ లలో గాంధీ సినిమా ప్రదర్శనకు ఏర్పాట్లు పూర్తి చేసిన్నట్లు కలెక్టర్ తెలిపారు.




