విద్యార్థులకు నూలి పురుగుల నిర్మూలన మాత్రలు వేసిన ఆరోగ్య సిబ్బంది.
బాన్సువాడ, సెప్టెంబర్ 15 (జనంసాక్షి):
జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా గురువారం బీర్కూరు మండల కేంద్రంలోని సన్ వే ప్రైవేటు పాఠశాలలో ఆరోగ్య సిబ్బంది విద్యార్థులకు నులి పురుగు నిర్మూలన మాత్రలు వేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగ పరమేశ్వరరావు మాట్లాడుతూ చిన్న పిల్లల్లో నులిపురుగుల అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం రోజున విద్యార్థులకు నులి పురుగుల నిర్మూలన మాత్రలు వేయించడం జరుగుతుందని, విద్యార్థులు వ్యక్తిగత శుభ్రత తప్పనిసరి పాటించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకుడు శేఖర్ యాదవ్, బీర్కూర్ ఆరోగ్య కేంద్రం సిబ్బంది, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
Attachments area