విద్యార్థులతో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని జన్మదిన వేడుకలు
-కస్తూర్భా గాంధీ పాఠశాలలో జన్మదిన వేడుకలు జరుపుకున్న ఉమా మహేశ్వరి
-శుభాకాంక్షలు తెలుపిన జడ్పీటీసీ ఝాన్సీ లక్ష్మీ, ఉపాధ్యాయినిలు
మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్23(జనంసాక్షి)
గార్ల మండలానికి చెందిన జనంసాక్షి పత్రిక మహబూబాబాద్ జిల్లా బ్యూరో చీఫ్ రావూరి ప్రశాంత్ సతీమణి రావూరి ఉమామహేశ్వరి సాఫ్ట్ వేర్ ఉద్యోగిని తన జన్మదిన వేడుకలను గార్ల కస్తూర్భా గాంధీ పాఠశాలలోని విద్యార్థులతో జరుపుకున్నారు. ఈ వేడుకలకు గార్ల జడ్పీటీసీ ఝాటోట్ ఝాన్సీ లక్ష్మీ పాల్గొని ఆమెకు శుభాకాంక్షలు తెలిపి విద్యార్థునులతో మాట్లాడుతూ విద్యపై పట్టుదలతో ఉమ మహేశ్వరి ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగిణిగా రాణిస్తుందని పెళ్ళైన తరువాత కూడా వెనుకడుగేయకుండా విద్యపై పట్టుదలతో ఉద్యోగం సాధించి ఆదర్శంగా నిలిచిందని ఆమెను ఆదర్శంగా తీసుకుని ప్రతి విద్యార్థిని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. కస్తూర్భా పాఠశాలలో విద్యానభ్యసిస్తూ స్టేట్ థర్డ్ ర్యాంక్ సాధించిన విద్యార్థినిని అభినందించారు. పండుగ సెలవలలో ఇంటిపట్టునే జాగ్రత్తగా ఉండాలని బైట సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. తల్లిదండ్రులు పనికి వెళ్లిన సమయాల్లో చెరువులకు, నీటి ప్రవహక ప్రాంతాలకు వెళ్లవద్దని, సెల్ ఫోన్లకు దూరంగా ఉంటూ వచ్చే పదిహేను రోజుల సెలవలల్లో పుస్తకాలతో ప్రేమను పెంచుకుని మరింత జ్ఞానంతో పాఠశాలకు తిరిగి రావాలని కోరారు. ఉమా మహేశ్వరి మాట్లాడుతూ విద్యతోనే ఏదైనా సాధ్యమని పుస్తకాలు జ్ఞానంతో పాటు అనుభవాలు, క్రమశిక్షణను కూడా నేర్పుతాయని తల్లిదండ్రులు విద్యార్థుల జీవితాలకోసం చేసిన కష్టమంతా వారు ఎదిగినరోజే వారి శ్రమకు గుర్తింపని ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన, విలువైన విద్య దొరుకుతుందని దానిని వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనంసాక్షి జిల్లా బ్యూరో చీఫ్ రావూరి ప్రశాంత్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎస్ఓ పి లలిత, అపర్ణ, సుశీల, స్వరూప, అన్నపూర్ణ, విజయ, స్వప్న, పార్వతి తదితరులు పాల్గొన్నారు.