Tuesday, 3 November 2026

విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలి

మాధవి :శామీర్ పేట్,జనంసాక్షి :తుంకుంట మున్సిపాలిటీ పరిధి దేవరయంజాల్ జిల్లా పరిషత్ పాఠశాలలో 2021-2022 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు
ఎస్ ఏ బయో సైన్స్ ఉపాధ్యాయురాలు శ్రీమతి వల్లభనేని.మాధవి వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం నగదు బహుమతి అందజేశారు.ప్రతిభ కనబరిచిన విద్యార్థులు
ప్రధమ- G.దీపక GPA -9.8:12,000 వేలు
ద్వితీయ-భార్గవ్-GPA-9.5:11,000 వేలు తృతీయ- అంబేదాబి-GPA-9.2
10,000 వేలు
చతుర్ధ-తనిష్-GPA-9
5,000 వేలు నగదు బహుమతి అందజేసి విద్యార్థులను అభి నందించారు.ఈ కార్య క్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్వరూప రాణి,తుంకుంట మున్సిపాలిటీ వైస్ చైర్మన్ వాణి వీరారెడ్డి,11 వ వార్డు కౌన్సిలర్ నర్సింగ్ రావు గౌడ్,తుంకుంట మున్సి పాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, రామాలయం మాజీ ధర్మకర్త టీచర్ నర్సింహా రెడ్డి,టిఆర్ఎస్ నాయకులు మహేష్ గౌడ్, ఉపాధ్యా యులు, విద్యార్థుల తల్లి దండ్రులు తదితరులు పాల్గొన్నారు.
27 ఎస్పీటీ -3:నగదు పురస్కారం అందజేస్తున్న దృశ్యం