: కౌన్సిలర్ నర్సింగ్ రావ్ గౌడ్ : శామీర్ పేట్, జనం సాక్షి :
భారత స్వతంత్ర 75 వ వజ్రోత్సవాల సందర్భంగా తూముకుంట మున్సిపాలిటీ పరిధి దేవరయంజాల్ జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థుల చేత ఆటల పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం రోజు వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా మున్సిపాలిటీ 11 వ వార్డ్ కౌన్సిలర్ పి. నర్సింగరావు గౌడ్ విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్వరూప రాణి,మాజీ ఎంపీటీసీ జైపాల్ రెడ్డి,
టీచర్ నర్సింహారెడ్డి,మున్సిపాలిటీ కోఆప్షన్ మెంబర్ షఫీ,శ్రీనివాస్ రెడ్డి,ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
22ఎస్పీటీ -1: విద్యార్థులకు బహుమతులు అందజేసిన దృశ్యం




