Wednesday, 4 November 2026

హుస్నాబాద్ పట్టణ సీఐగా కిరణ్ బాధ్యతలు

హుస్నాబాద్ ఆగస్టు 22(జనంసాక్షి) హుస్నాబాద్ పట్టణ నూతన సీఐగా ఎర్రోళ్ల కిరణ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఎర్రోళ్ల కిరణ్ 2009 బ్యాచ్ ఎస్ఐ, జగిత్యాల సిసిఎస్ సీఐ బదిలీ నుండి హుస్నాబాద్ నూతన సీఐగా బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని, ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే నేరుగా వచ్చి కలవాలని, శాంతి భద్రతల విషయంలో ప్రజలు ప్రజాప్రతినిధులు సహకరించాలని ఫ్రెండ్లీ పోలీసింగ్ తో సేవలు అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ ఎస్ ఐ శ్రీధర్, అక్కన్నపేట ఎస్ఐ తాండ్ర వివేక్, కోహెడ ఎస్సై నరేందర్ రెడ్డి లు ఆయనకు ఘన స్వాగతం పలికారు.