విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించిన జిల్లా విద్యాశాఖ అధికారి

ములుగు జిల్లా బ్యూరో, ఆగష్టు 28(జనంసాక్షి):- వెంకటాపుర్ (రామప్ప) పాఠశాలలో తల్లిదండ్రుల ఉపాధ్యాయ సమావేశానికి హాజరైన ములుగు జిల్లా విద్యాశాఖ అధికారి పానిని పి టి ఏ సమావేశంలో విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులతో చర్చించడం జరిగినది తల్లిదండ్రుల అభిప్రాయాలను సలహాలను సూచనలను తీసుకోవడం జరిగింది సమావేశాన్ని ఉద్దేశించి DEO మాట్లాడుతూ పిల్లలు పాఠశాలకు రెగ్యులర్గా హాజరయ్యేలా చూడాలని పాఠశాల అభివృద్ధి కార్యక్రమల పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయుల సమావేశము ప్రతినెల మూడవ శనివారము అందరూ హాజరై పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా విద్యాపరమైన పురోగతి అభ్యాస ఫలితాల సాధన పాఠశాల సౌకర్యాల మెరుగుదల మధ్యాహ్న భోజనము మొదలైన వాటి గురించి చర్చించుకుని పాఠశాల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో తల్లిదండ్రులు SMC చైర్మన్లు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

తాజావార్తలు