జహీరాబాద్ ఆగస్టు 21 (జనంసాక్షి) ఈ నెల 23వ తేదీన జరుపబోయే విద్యాలయాల బంద్ ను విజయవంతం చేయాలి అని ఎమ్మార్పీఎస్ జహీరాబాద్ నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ అబ్రహాం మాదిగ అన్నారు.ఆదివారం స్థానిక ఐ బి ఆవరణలో సమావేశం నిర్వహించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోది మౌనం వీడి ఇంద్ర కుమార్ మేఘ్వాల్ ను హత్య చేసిన దుండగులను శిక్షించాలి అన్నారు. రాజస్థాన్ లోని జాలోర్ జిల్లా సురానా గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల పసిబాలుడైన ఇందర్ కుమార్ మేఘ్వాల్ ను కొట్టి చంపిన మనువాది చైల్ సింగ్ ను ఉరి తియ్యాలనీ, పసి బాలుడి కుటుంబానికి కోటి రూపాయల నష్ట పరిహారంప్రకటించాలని అన్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని ప్రభుత్వం మరియు ప్రైవేటు విద్యాలయాల విద్యార్థులు, మానవతవాదులు, ప్రజాస్వామిక వాదులు, పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయుటకు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో రాంచందర్ మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు,వేంకటేశం రజక సంఘం ప్రధాన కార్యదర్శి,మొగులప్ప రజక సంఘం పట్టణ ఉపాధ్యక్షులు,రవీందర్ రజక సంఘంతాలుక కోశాధికారి.శ్రీకాంత్ పద్మశాలి యువజన రాష్ర్ట కార్యదర్శి,ఎమ్మెస్పి నాయకులు జైరాజ్,ఎమ్మార్పియస్ నాయకులు రాజు,నర్సింములు నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
విద్యాలయాల బంద్ ను విజయవంతం చేయాలి




