ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి కోదాడ నియోజక కోఆర్డినేటర్ ఏపూరి రాజు మాదిగ
కోదాడ, ఆగస్టు21(జనం సాక్షి)
ఈనెల 23న నిర్వహించ తలపెట్టిన విద్యాసంస్థల బందును విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ మహాజన సోషలిస్ట్ పార్టీ కోదాడ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఏపూరి రాజు మాదిగ అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని ఎమ్మెస్ కళాశాలలో ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి, ఎంఎస్ఎఫ్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రోజురోజుకి దేశంలో దళితులపై దాడులు పెరుగుతున్నాయని రాజస్థాన్ లోని సురానా గ్రామంలో కుండలో మంచినీరు తాగాడన్న నెపంతో కులం పేరుతో స్కూల్ టీచర్ చేసిన దాడిలో దళిత బాలుడు ఇంద్ర కుమార్ మెగ్వాల్ హత్యను ఖండిస్తూ ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఇచ్చిన పిలుపుమేరకు ఈనెల 23న తలపెట్టిన విద్యాసంస్థల బందులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో మహాజన సోషలిస్ట్ పార్టీ నియోజకవర్గ నాయకులు యలమర్తి రాము మాదిగ, కొండపల్లి ఆంజనేయులు, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు పుల్లూరి ఏసుబు, ఎమ్మెస్ ఆఫ్ నియోజకవర్గ ఇంచార్జ్ కుక్కల కృష్ణ మాదిగ, ఎమ్మార్పీఎస్ పట్టణ ఉపాధ్యక్షులు సోమపంగు నరేష్ ,పట్టణ కార్యదర్శి గజ్జి గోపి, ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు రామకృష్ణ, దీపక్, శశికాంత్ ,రోహిత్, యశ్వంత్, రవిచంద్ర ,భాను ప్రకాష్, ఆదర్శ్ తదితరులు పాల్గొన్నారు




