హైదరాబాద్,మే26(జనం సాక్షి): రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలను తీసుకురావడమంటే ప్రభుత్వ విద్యారంగాన్ని నీరుగార్చడమేనని ఎస్‌ఎఫ్‌ఐ నేతలు అన్నారు. ప్రస్తుతం ఉన్న యూనివర్సిటీల్లో సమస్యలను పరిష్కరించకుండా ప్రైవేటు వర్సిటీలను ప్రోత్సహించడం తగదన్నారు. అధికారంలోకి రాకముందు విద్యార్థుల సమస్యలపై పలు హావిూలు ఇచ్చిన తెరాస నాయకులు ఇప్పుడు వాటిని పూర్తిగా విస్మరిస్తున్నారని విమర్శించారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలపై ఆందోళన నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఉపాధి అవకాశాలు కల్పించకుండా నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందన్నారు. కేరళ రాష్ట్రం తరహాలో నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ భృతిని చెల్లించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏడాదిలో చేపట్టే ఉద్యోగ నియామకాలపై వార్షిక ప్రణాళిక విడుదల చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రయివేటు విశ్వవిద్యాలయాల బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.




