విద్యుత్ ఘాతంతో ఎద్దు మృతి చెందడంతో బాధితునికి అందిన సాయం

కురవి జూలై
(జనం సాక్షి న్యూస్)
కురవి మండలం ఎలుక చెట్ల తండా గ్రామ పంచాయతీ మేఘ్యతండా వాసి బానోత్ వెంకన్న తండ్రి పేరు గోలియా కు రైతు కాడెద్దు గత కొద్దిరోజుల క్రితం విద్యుదాఘాతంతో మృతి చెందగా విద్యుత్ శాఖ నుండి డోర్నకల్ శాసనసభ్యులు డిఎస్ రెడ్యానాయక్ సహకారంతో మంజూరైన 40000 వేల రూపాయల చెక్కును తెరాస యూత్ రాష్ట్ర నాయకులు గుగులోత్ రవి నాయక్, విద్యుత్ శాఖ ఏడి ప్రసాద్ బాధ్యతుడైన రైతుకు అందించారు.