విద్యుత్ శాఖలో ఉదయించిన అవినీతి రవికిరణం.

 

పినపాక నియోజకవర్గం, ఆగస్టు 26(జనంసాక్షి):-
అక్రమ వసూళ్లకు అలవాటు పడ్డ విద్యుత్ శాఖ ఓ ఉన్నతాధికారి ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్ చేసి మరీ వసూళ్లు చేసి సన్న చిన్న కారు రైతులును పీల్చి పిప్పి చేస్తున్నా అవినీతి అధికారి. ప్రాథమిక సమాచారం సేకరించిన మీడియా బృందం.
మణుగూరు సబ్ డివిజన్ విద్యుత్ శాఖలో ఓ అవినీతి రవికిరణం అవినీతి కాంతులు ఎదజల్లుతుంది. కాసుల కోసం కక్కుర్తి పడే ఈ అవినీతి అధికారి వలన ప్రభుత్వ ఖజానాకి కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్లు ఆ అవినీతి అధికారి సర్వే చేసిన లైన్ ఎస్టిమేట్ లే అందుకు సాక్షం. గృహ వసరాలకు విద్యుత్ మీటర్లు మంజూరు విషయమై గతంలో అవినీతికి పాల్పడిన సంఘటనలో ఉన్నత అధికారులు హెచ్చరించిన మరని నైజం.
పైసలిస్తే ఎంతటి కరప్షన్ కార్యానికైనా ఈ అవినీతి అక్రమార్కుడు సిద్దం అని,అమాయక ఆదివాసి సన్న,చిన్న కారు రైతుకు గొడ్డలి పెట్టులా మారి ఎందరో చిన్నకారు రైతులు ఈయన ధన దాహానికి తీవ్రంగా నష్టపోయారు.జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో విచారణ
చేసి సూక్ష్మంగా పరిశీలిస్తే ఎన్నో అవినితీ అధికారి ఆగడాలు బయటకి వస్తాయి.