Wednesday, 4 November 2026

వినాయక ఉత్తోత్సవాలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి సంగారెడ్డి డిఎస్పి రవీందర్ రెడ్డి

జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ మంగళవారం ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సంగారెడ్డి డి.ఎస్.పి రవీందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని వినాయక ఉత్తోత్సవాలు కలిసిమెలిసి జరుపుకోవాలని ఇచ్చారు సీఐ నాగరాజు మాట్లాడుతూ వినాయక ఉత్తోత్సవ మండపంలో ఎలాంటి అవాంఛన్లు జరగకుండా చూసుకునే బాధ్యత వినాయక మండప కమిటీ సభ్యులదేనని ఆయన అన్నారు మున్సిపల్ చైర్మన్ గూడెం మల్లయ్య మాట్లాడుతూ వినాయక నిమజ్జనం రోజు మున్సిపల్ సిబ్బంది తరఫున ప్రతి వినాయకునికి స్టేజి సమర్పించి పూలమాలతో సత్కరిస్తామని తెలిపారు కౌన్సిలర్ సత్యనారాయణ చిట్టిబాబు మాట్లాడుతూ శాంతికి మారుపేరుగా జోగుపేట అందోల్ అని మారుపేరుగా ఉన్న ఆందోల్ మండల పలు గ్రామాలు శాంతియుతంగా నిమజ్జనంజరుపుకొని ప్రజలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు ఇవ్వకుండా ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని అన్నారు ఎస్సై సామాన్య నాయక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పోలీస్ సాకారం తీసుకోవాలని సోషల్ మీడియాలో శాంతి ఫోటోలు వీడియోలు మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తే చేయరాదని తెలిపారు ఇతర మత విశ్వాసంపై వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదు అన్నారు వినాయక మండపాలకు నిమ్మాజానికి సంబంధించి పలు వాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమానికి ఆందోల్ జోగిపేట మున్సిపల్ కౌన్సిలర్లు కో ఆప్షన్ నెంబర్ పైసల్ అందోల్ మండల ఎంపీటీసీలు సర్పంచులు వివిధ యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు